Friday, 13 February 2026
  • Home  
  • మార్కెట్ కమిటీ బకాయిలను వెంటనే చెల్లించాలి…చైర్మన్ రంగినేని
- తిరుపతి

మార్కెట్ కమిటీ బకాయిలను వెంటనే చెల్లించాలి…చైర్మన్ రంగినేని

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 13: శ్రీకాళహస్తిలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం రైస్ మిల్లర్లు, వ్యాపారస్తులతో మార్కెట్ కమిటీ అధ్యక్షులు రంగినేని చెంచయ్య నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. మార్కెట్ కమిటీ అభివృద్ధి, నిధుల సమీకరణే లక్ష్యంగా జరిగిన ఈ భేటీలో ఆయన పలు కీలక సూచనలు గూర్చి మాట్లాడుతూ…. మార్కెట్ కమిటీకి చెల్లించాల్సిన పాత బకాయిలను రైస్ మిల్లర్లు, వ్యాపారస్తులు వెంటనే చెల్లించాలని, ఆలస్యం చేయకుండా కమిటీకి సహకరించాలని కోరారు. ప్రతి నెలా జరిగే కొనుగోళ్లకు సంబంధించిన నివేదికలను క్రమం తప్పకుండా, గడువులోగా కార్యాలయానికి సమర్పించాలని స్పష్టం చేశారు. వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత పాటిస్తూ, మార్కెట్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడకుండా చూడాలని మార్కెట్ కమిటీ అభివృద్ధి చెందితే రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చని, ఇందుకు వ్యాపారస్తులందరూ తమ వంతు తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధికారులు, నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ రైస్ మిల్లర్లు మరియు వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.