Thursday, 12 February 2026
  • Home  
  • మానసిక దృఢత్వం, మత్తు పదార్థాల నిరోధంపై కస్తూర్బా బాలికల విద్యాలయంలో అవగాహన
- కామారెడ్డి

మానసిక దృఢత్వం, మత్తు పదార్థాల నిరోధంపై కస్తూర్బా బాలికల విద్యాలయంలో అవగాహన

కామారెడ్డి 31 డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళ వారం మానసిక సమస్యలు, పరీక్షా కాలంలో జాగ్ర త్తలు, మాదక ద్రవ్యాల నిరోధంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ వనిత ఈ కార్యక్రమాన్ని సమీకరిం చారు. జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ, ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ, ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే మానసిక దృఢ త్వం తప్పనిసరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడి న జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ మానసి కంగా దృఢంగా ఉండాలని సూచించారు. “అప్పుడే మీ ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చు” అని తెలిపారు. టీనేజీ వయస్సులో వచ్చే అవరోధాలను వివరిం చుతూ, పరీక్షా కాలంలో ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవ్వాలని, మానసిక ఒత్తిడి పెట్టుకోవద్దని ఆయన అన్నారు. మొబైల్ వ్యసనానికి దూరంగా ఉండాల ని సలహా ఇచ్చారు. మానసిక సమస్యలు తలెత్తి నా తమను సంప్రదించాలని విద్యార్థులకు పిలుపు నిచ్చారు.యువత మత్తు పదార్థాలు వద్దు.. బంగా రు భవిష్యత్తు కోల్పోకండిఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ మాట్లాడుతూ, టీనేజీలు మత్తు పదార్థాల కు లోనై, విలువైన జీవితాలను వృధా చేసుకుం టున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు కలిగే అనర్థాలను ఇంట్లో చెప్పాలని సూచించారు. రామారెడ్డి మండలంలో డ్రగ్స్ వాడ కానికి బానిసైన వ్యక్తులను ఇప్పటికే పట్టు కొని, మందలించి, కౌన్సిలింగ్ చేశామని తెలిపారు. “కుటుంబం, సమాజాన్ని కాపాడటం మీ బాధ్యత.. మీరు కూడా భాగస్వాములవ్వండి” అని యువత కు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిరోధానికి అందరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమం లో పీఎచ్సీ మెడికల్ ఆఫీసర్ డా. సురేష్, సైకియా ట్రిక్ సోషల్ వర్కర్ డా. రాహుల్, ఉపాధ్యాయులు పద్మ, గంగలక్ష్మి, రజిత, అరుణలు, 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

కామారెడ్డి 31 డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) :

కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళ వారం మానసిక సమస్యలు, పరీక్షా కాలంలో జాగ్ర త్తలు, మాదక ద్రవ్యాల నిరోధంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ వనిత ఈ కార్యక్రమాన్ని సమీకరిం చారు. జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ, ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ, ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే మానసిక దృఢ త్వం తప్పనిసరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడి న జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ మానసి కంగా దృఢంగా ఉండాలని సూచించారు. “అప్పుడే మీ ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చు” అని తెలిపారు. టీనేజీ వయస్సులో వచ్చే అవరోధాలను వివరిం చుతూ, పరీక్షా కాలంలో ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవ్వాలని, మానసిక ఒత్తిడి పెట్టుకోవద్దని ఆయన అన్నారు. మొబైల్ వ్యసనానికి దూరంగా ఉండాల ని సలహా ఇచ్చారు. మానసిక సమస్యలు తలెత్తి నా తమను సంప్రదించాలని విద్యార్థులకు పిలుపు నిచ్చారు.యువత మత్తు పదార్థాలు వద్దు.. బంగా రు భవిష్యత్తు కోల్పోకండిఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ మాట్లాడుతూ, టీనేజీలు మత్తు పదార్థాల కు లోనై, విలువైన జీవితాలను వృధా చేసుకుం టున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు కలిగే అనర్థాలను ఇంట్లో చెప్పాలని సూచించారు. రామారెడ్డి మండలంలో డ్రగ్స్ వాడ కానికి బానిసైన వ్యక్తులను ఇప్పటికే పట్టు కొని, మందలించి, కౌన్సిలింగ్ చేశామని తెలిపారు. “కుటుంబం, సమాజాన్ని కాపాడటం మీ బాధ్యత.. మీరు కూడా భాగస్వాములవ్వండి” అని యువత కు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిరోధానికి అందరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమం లో పీఎచ్సీ మెడికల్ ఆఫీసర్ డా. సురేష్, సైకియా ట్రిక్ సోషల్ వర్కర్ డా. రాహుల్, ఉపాధ్యాయులు పద్మ, గంగలక్ష్మి, రజిత, అరుణలు, 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.