మహిళా శ్రేయస్సే సమాజ పురోగతి అని, మహిళా సాధికారతే అభివృద్ధికి అసలైన పునాది అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె. సూర్యనారాయణ గారి పిలుపు మేరకు మార్చి 7వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న భారీ సదస్సుకు సంబంధించిన గోడపత్రికను గురువారం చిట్వేల్ పీహెచ్‌సీ లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రైల్వే కోడూరు తాలూకా ఏపీజీఈఏ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. మహిళా ఉద్యోగుల సమస్యలు, వారి హక్కులు మరియు సాధికారతపై చర్చించేందుకు విజయవాడలో నిర్వహించే ఈ రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి చిట్వేల్ పీహెచ్‌సీలోని మహిళా ఉద్యోగులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో పనిచేస్తున్న మహిళా వైద్యులు, సిబ్బందికి అధికారిక ఆహ్వాన పత్రాలను అందజేశారు. మహిళా సాధికారత నినాదాలతో నిర్వహించనున్న ఈ సదస్సు ఉద్యోగినుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని అసోసియేషన్ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీజీఈఏ తాలూకా ప్రెసిడెంట్, పీహెచ్‌సీ వైద్యులు మరియు మహిళా ఉద్యోగస్థులు పాల్గొన్నారు.

మహిళా సాధికారతే సమాజానికి పునాది!