ఖమ్మం ఏప్రిల్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా ఇంచార్జి )
మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ లకు చట్ట బద్దత కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు గుండాల కృష్ణ పేర్కొన్నారు.సంఘం ముఖ్య నాయకుల సమావేశం శని వారం ఖమ్మం లో జరిగింది.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ తో పాటు ఓబీసీ లకు వాటా కల్పించాలని అప్పుడే పూలేకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు.జనగణన లో కులం కాలం వున్నప్పటికీ ఓబీసీ క్లాసిఫికేశన్ లేకపోవడంవల్ల బీసీల జనాభా లెక్క తేలడం లేదన్నారు.వెంటనే ఓబీసీ గణన చేపట్టి దానికి అనుగుణంగా మహిళా రిజర్వేషన్ లో ఓబీసీ లకు సాబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు.బిల్లు అమలు కాకపోవడం వల్లఖమ్మం లో రాజకీయ సామాజిక అసమానతలు మరింత పెరిగాయని అన్నారు.కొన్ని సంవత్సరాలు గా పూలే జయంతి వేడుకలు రోడ్ల మీద నిర్వహించుకోవడం విచారకరమని వెంటనేఖమ్మం లో బీసీ భవన్ ను వెంటనే బీసీ భవన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు.అదేవిధంగా నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ లో పులె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డి డిసిబి మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం,జిల్లా పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు బొమ్మా రాజేశ్వరరావు,గౌడ సంఘం అధ్యక్షులు కత్తి నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.



