Tuesday, 3 March 2026
  • Home  
  • మహిళా దినోత్సవ వేడుకలు: విశాఖ పోలీస్ బ్యారెక్స్‌లో రంగురంగుల ముగ్గుల పోటీలు
- విశాఖపట్నం

మహిళా దినోత్సవ వేడుకలు: విశాఖ పోలీస్ బ్యారెక్స్‌లో రంగురంగుల ముగ్గుల పోటీలు

విశాఖపట్నం మార్చి (పున్నమి ప్రతినిధి) పోలీస్ బ్యారెక్స్ మైదానంలో ముగ్గుల పోటీలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా నగరంలోని పోలీస్ బ్యారెక్స్ మైదానంలో ఆదివారం మహిళా పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం సిటీ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి మహిళా పోలీసులు, సిబ్బంది కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పొడులతో అందమైన ముగ్గులు వేస్తూ తమ సృజనాత్మకతను, ప్రతిభను ప్రదర్శించారు. మహిళా ఎస్‌ఐలు, డీసీపీలు ప్రతి ముగ్గును పరిశీలించి అభినందనలు తెలిపారు. మొత్తం 60 మంది మహిళా పోలీసులు ఈ పోటీల్లో పాల్గొని వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో సాగి అందరిలోనూ ఉత్సాహాన్ని నింపింది.

విశాఖపట్నం మార్చి (పున్నమి ప్రతినిధి)

పోలీస్ బ్యారెక్స్ మైదానంలో ముగ్గుల పోటీలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా నగరంలోని పోలీస్ బ్యారెక్స్ మైదానంలో ఆదివారం మహిళా పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం సిటీ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి మహిళా పోలీసులు, సిబ్బంది కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పొడులతో అందమైన ముగ్గులు వేస్తూ తమ సృజనాత్మకతను, ప్రతిభను ప్రదర్శించారు. మహిళా ఎస్‌ఐలు, డీసీపీలు ప్రతి ముగ్గును పరిశీలించి అభినందనలు తెలిపారు. మొత్తం 60 మంది మహిళా పోలీసులు ఈ పోటీల్లో పాల్గొని వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో సాగి అందరిలోనూ ఉత్సాహాన్ని నింపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.