Saturday, 7 March 2026
  • Home  
  • మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా మణులకు సర్పంచ్ పోతరాజు చంటి ఘన సన్మానం
- రాజన్న సిరిసిల్ల

మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా మణులకు సర్పంచ్ పోతరాజు చంటి ఘన సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని నేడు కేశన్నపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పోతరాజు చంటి గారి అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. రేపు జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా సంఘాల సభ్యులను సర్పంచ్ పోతరాజు చంటి గారు మరియు గ్రామ ప్రముఖులతో కలిసి శాలువాలతో సన్మానించి గౌరవించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పోతరాజు చంటి గారు మాట్లాడుతూ కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ సేవలోనూ మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళల కృషి వల్లే గ్రామ సమాజం ముందుకు సాగుతుందని, మహిళా సాధికారతతో గ్రామాభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఆయన అన్నారు. అలాగే గ్రామంలోని మహిళా మణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వజ్జపల్లి శ్రీకాంత్, వార్డు సభ్యులు సంజీవరావు, మధు, లక్ష్మీ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సీఏ రాజు మరియు గ్రామ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని నేడు కేశన్నపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పోతరాజు చంటి గారి అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. రేపు జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా సంఘాల సభ్యులను సర్పంచ్ పోతరాజు చంటి గారు మరియు గ్రామ ప్రముఖులతో కలిసి శాలువాలతో సన్మానించి గౌరవించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పోతరాజు చంటి గారు మాట్లాడుతూ కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ సేవలోనూ మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళల కృషి వల్లే గ్రామ సమాజం ముందుకు సాగుతుందని, మహిళా సాధికారతతో గ్రామాభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఆయన అన్నారు. అలాగే గ్రామంలోని మహిళా మణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వజ్జపల్లి శ్రీకాంత్, వార్డు సభ్యులు సంజీవరావు, మధు, లక్ష్మీ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సీఏ రాజు మరియు గ్రామ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.