పున్నమి ప్రతినిథి షేక్ . ఉస్మాన్ అలీ…✍️
భగీరథ జయంతి పునస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు గురువారం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహర్షి భగీరథ కృషి,పట్టుదల నేటి యువతరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.