మనుబోలు( పున్నమి విలేఖరి)6,ఏప్రియల్ :భారతీయ జనతా పార్టీ 38 వఆవిర్భావ దినోత్సవ వేడుకలను మనుబోలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల శాఖ అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి ,జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు ఆద్వర్యంలో మనుబోలు బైపాస్ కూడలి నందు బిజెపి రాష్ట్ర నాయకురాలు బైరెడ్డి శబరి బిజెపి జెండాను ఆవిష్కరించారు . అనంతరం నాయకులు మాట్లాడుతూ శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఏ ఉద్దేశంతో పార్టీని స్థాపించారో ఆయన ఆశయాలకు అనుగుణంగానే నేడు భారత ప్రధాని నేరంద్రమోడీ ముందుకు తీసుకెళ్లుతున్నట్లు పేర్కొన్నారు. దేశం కోసం ధర్మ కోసం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నట్లు వివరించారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి నేడు దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతుండటంతో పాటు ప్రపంఛంలోనే అతి ఎక్కువ సభ్యత్వం కల్గిన అతి పెద్ద పార్టీగా బిజెపి కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో నూతనంగా దేశ పరిపాలన రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, అమలు చేసిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి వెళ్లి నాయకులు ప్రజలందరికీ తెలియజేయాలని అన్నారు .ఈ కార్యక్రమంలో నాయకులు వీర ప్రతాప్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు .
మనుబోలు లో ఘనంగా భాజపా ఆవిర్భావ దినోత్సవం