బుచ్చిరెడ్డిపాలెం ఫిబ్రవరి 5 ( పున్నమి విలేఖరి )
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని సచివాలయం – 4 మరియు వవ్వేరు సచివాలయం – 2 ఏరియాలలో నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు స్వచ్ఛభారత్, మనం మన పరిసరాల శుభ్రత పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మన పరిసరాల్లో చెత్త వేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలని, నగర పంచాయతీ వాహనాల్లోనే చెత్తను వేయాలని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వేయాలని సూచించారు. బహిరంగ మల మూత్ర విసర్జన చేయకుండా ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా చెత్త వేసిన యెడల జరిమానా విధించబడును హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో 2 సచివాలయాల కార్యదర్శులు, సిబ్బంది, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, విఏవో లు పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు
బుచ్చిరెడ్డిపాలెం ఫిబ్రవరి 5 ( పున్నమి విలేఖరి ) బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని సచివాలయం – 4 మరియు వవ్వేరు సచివాలయం – 2 ఏరియాలలో నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు స్వచ్ఛభారత్, మనం మన పరిసరాల శుభ్రత పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మన పరిసరాల్లో చెత్త వేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలని, నగర పంచాయతీ వాహనాల్లోనే చెత్తను వేయాలని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వేయాలని సూచించారు. బహిరంగ మల మూత్ర విసర్జన చేయకుండా ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా చెత్త వేసిన యెడల జరిమానా విధించబడును హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 2 సచివాలయాల కార్యదర్శులు, సిబ్బంది, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, విఏవో లు పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు

