నంద్యాల ముస్లిం మైనారిటీల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తీసుకుంటున్న చిత్తశుద్ధికి నిదర్శనంగా, ఇమామ్‌లు మరియు మౌజన్‌లకు 12 నెలల గౌరవ వేతనం కోసం రూ. 90 కోట్ల నిధులను విడుదల చేసినందుకు గాను, జిల్లా ఇమాముల సంఘం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ కి కృతజ్ఞతలను తెలియజేశారు
ఈ సందర్భంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన అభినందన సభలో జిల్లా ఇమాముల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
*మంత్రి ఎన్ఎండి ఫరూక్ చొరవ అభినందనీయం*
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎన్నికల హామీని నెరవేర్చడమే కాకుండా, రాష్ట్రంలో మైనారిటీ వర్గాల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని నిరూపించారని సంఘం నాయకులు తెలిపారు. రూ. 90 కోట్ల నిధుల విడుదల నిర్ణయం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఇమామ్‌లు మరియు మౌజన్‌ల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించిందని. ఈ నిధులు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో, ముఖ్యంగా వారి కుటుంబ పోషణకు ఎంతో సహాయపడతాయని వారు పేర్కొన్నారు. “మైనారిటీల సంక్షేమం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ చాలా మంచిదని. గౌరవ వేతనాల బకాయిలను ఒకేసారి విడుదల చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంమని అన్నారు. ఇది రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీల పట్ల ముఖ్యమంత్రి కి ఉన్న ఆదరణను తెలియజేస్తుందని,” సంఘం నాయకులు తెలిపారు . ఈ సంక్షేమ చర్యకు గాను మంత్రి ఎన్ఎండి ఫరూక్ కృషిని కూడా ఇమాముల సంఘం ప్రత్యేకంగా అభినందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నాయకత్వానికి, అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని జిల్లా ఇమాముల సంఘం తెలిపారు . రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల గౌరవాన్ని, ఆర్థిక భద్రతను పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రకమైనదని వారు కొనియాడారు.
*తెలుగుదేశం పార్టీ మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంది: మంత్రి ఎన్ఎండి ఫరూక్*
మైనార్టీ సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు . ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గారు ఆదేశించిన మేరకు, ఇమాములకు మరియు మోజోన్లకు రూ. 90 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం మైనార్టీ వర్గాల అభ్యున్నతికి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని , ముఖ్యమంత్రిగారి చొరవతో ఇమాములు, మోజోన్ల ఆర్థిక భద్రత కోసం రూ. 90 కోట్ల నిధులను విడుదల చేయడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నిధులు మైనార్టీ వర్గాల సంక్షేమానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇమాముల సంఘం అధ్యక్షులు హఫీజ్ ఖాజీ మహమ్మద్ అంజద్ భాష సిద్ధికి , ముఫ్తీ మహమ్మద్ రఫీ సాహెబ్ , మూలాన ఇబ్రహీం సాహెబ్ , హాజీ ఇలియాజ్ సాహెబ్ , మౌలానా అబ్దుల్ రఫీ , హఫీజ్ మహమ్మద్ ఆజమ్, హఫీస్ మహమ్మద్ కాజీ మియా , అలీమ్, హుస్సేన్ , మన్ నూర్ , ఇస్మాయిల్ , జబీబుల్లా మరియు ఇమాములు మరియు మత పెద్దలు ఆలిములు తదితరులు పాల్గొన్నారు


