కామారెడ్డి, 05 అక్టోబర్, పున్నమి ప్రతినిధి :
కామారెడ్డి పట్టణంలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, జిల్లా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తక్షణమే అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు.ఈ సంద ర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదివారం ఉద యం ముంపునకు గురయ్యే అవకాశమున్న జీఆర్ కాలనీలో స్వయంగా పర్యటించారు.మున్సిపల్ కమిషనర్ సిహెచ్ రాజేందర్ రెడ్డి, సానిటరీ ఇన్స్పె క్టర్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.నదీ ప్రవాహంపై పరిశీలన భారీ వర్షాల కారణంగా జీఆర్ కాలనీ బ్రిడ్జి వద్ద ప్రవహిస్తున్న నీటి ఉధృతిని కలెక్టర్ దగ్గరుండి పరిశీలించారు. గతంలో భారీ వర్షాల వల్ల ఆయా ప్రాంతాల్లో కలిగిన ఇబ్బందులు, నష్టాలను దృష్టిలో ఉంచుకు ని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. కాలనీ వాసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా నిరంతరం పరిస్థితులను సమీక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించా రు. జీఆర్ కాలనీతో పాటు కామారెడ్డి పట్టణంలోని అన్ని లోతట్టు ప్రాంతాలలోనూ అధికారులు విస్తృ తంగా పర్యటిస్తూ, వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందు లు కలగకుండా తగిన తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాలు జారీ చేశారు.
.


