Wednesday, 25 March 2026
  • Home  
  • బ్లింకిట్ బ్యాగ్‌లో గంజాయి రవాణా – ఇద్దరు అరెస్ట్
- విశాఖపట్నం

బ్లింకిట్ బ్యాగ్‌లో గంజాయి రవాణా – ఇద్దరు అరెస్ట్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 25 శనివారం ఉదయం సుమారు 09:30 గంటలకు పి.ఎం. పాలెం పోలీస్ స్టేషన్‌కు చెందిన డబ్ల్యూ. ఎస్. ఐ. ఎన్‌. సునీత కి విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం ఆధారంగా సిబ్బందితో కలిసి కోమ్మాది ప్రాంతంలో ప్రత్యేక దాడి నిర్వహించగా, ఇద్దరు వ్యక్తులు బ్లింకిట్ డెలివరీ బ్యాగ్‌లో గంజాయి తీసుకెళ్తున్నట్లు గుర్తించబడినారు. వారిని వెంటాడి పట్టుకున్నారు. విచారణలో నిందితులను నల్లబిల్లి గణేష్ (వయసు 32), హోరో సంజయ్ కుమార్ (వయసు 29) లు గా గుర్తించారు. వీరి వద్ద నుండి మొత్తం 2 కిలోల గంజాయి స్వాధీనం చేసారు. కేసు క్రైమ్ నెం. 622/2025, యు/ఎస్ 20(b)(ii) ఎన్ డి పి ఎస్ యాక్ట్ 1985 ఆర్/డబ్ల్యు 187 బి ఎన్ ఎస్ ఎస్ 2023 కింద నమోదు చేయబడింది. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపారు. ఈ కేసు దర్యాప్తు సబ్-ఇన్‌స్పెక్టర్ కే. భాస్కరరావు పర్యవేక్షణలో జరుగుతోంది. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. బాలకృష్ణ సూచనలు: నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (గంజాయి) అక్రమ రవాణా, నిల్వ, విక్రయం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాధారణ ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే తక్షణమే పి.ఎం. పాలెం పోలీస్ స్టేషన్ (ఫోన్: 9440796060) కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 25

శనివారం ఉదయం సుమారు 09:30 గంటలకు పి.ఎం. పాలెం పోలీస్ స్టేషన్‌కు చెందిన డబ్ల్యూ. ఎస్. ఐ. ఎన్‌. సునీత కి విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం ఆధారంగా సిబ్బందితో కలిసి కోమ్మాది ప్రాంతంలో ప్రత్యేక దాడి నిర్వహించగా, ఇద్దరు వ్యక్తులు బ్లింకిట్ డెలివరీ బ్యాగ్‌లో గంజాయి తీసుకెళ్తున్నట్లు గుర్తించబడినారు. వారిని వెంటాడి పట్టుకున్నారు.

విచారణలో నిందితులను నల్లబిల్లి గణేష్ (వయసు 32), హోరో సంజయ్ కుమార్ (వయసు 29) లు గా గుర్తించారు. వీరి వద్ద నుండి మొత్తం 2 కిలోల గంజాయి స్వాధీనం చేసారు. కేసు క్రైమ్ నెం. 622/2025, యు/ఎస్ 20(b)(ii) ఎన్ డి పి ఎస్ యాక్ట్ 1985 ఆర్/డబ్ల్యు 187 బి ఎన్ ఎస్ ఎస్ 2023 కింద నమోదు చేయబడింది. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపారు.

ఈ కేసు దర్యాప్తు సబ్-ఇన్‌స్పెక్టర్ కే. భాస్కరరావు పర్యవేక్షణలో జరుగుతోంది.

ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. బాలకృష్ణ సూచనలు:

నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (గంజాయి) అక్రమ రవాణా, నిల్వ, విక్రయం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సాధారణ ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే తక్షణమే పి.ఎం. పాలెం పోలీస్ స్టేషన్ (ఫోన్: 9440796060) కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.