Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

బోగోలు లో ఆరు నామినేషన్ కేంద్రాల ఏర్పాటు

Punnami Newsroom Published:
బోగోలు లో ఆరు నామినేషన్ కేంద్రాల ఏర్పాటు

Story highlights

  • 16 గ్రామ పంచాయతీలకు ఆరు కేంద్రాలు..
  • ఎంపీడీవో సుబ్రమణ్యం వెల్లడి పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి బిట్రగుంట: బోగోలు మండలంలోని 16 గ్రామ పంచాయతీల పరిధిలో ఆరు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో సుబ్రమణ్యం తెలిపారు.
  • ఆయా పంచాయతీల వారీగా నామినేషన్ల స్వీకరణకు కేంద్రాలను కేటాయించారు.

16 గ్రామ పంచాయతీలకు ఆరు కేంద్రాలు.. ఎంపీడీవో సుబ్రమణ్యం వెల్లడి

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బిట్రగుంట: బోగోలు మండలంలోని 16 గ్రామ పంచాయతీల పరిధిలో ఆరు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో సుబ్రమణ్యం తెలిపారు. ఆయా పంచాయతీల వారీగా నామినేషన్ల స్వీకరణకు కేంద్రాలను కేటాయించారు.

బోగోలు పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో బోగోలు, విశ్వనాథరావుపేట పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తారు.

జక్కేపల్లిగూడూరులో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఎస్.జి.వి. కండ్రిక, జక్కేపల్లిగూడూరు, ఏబీ కండ్రిక పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తారు.

నాగులవరం కేంద్రంలో తాళ్లూరు, నాగులవరం పంచాయతీలకు, కోవూరుపల్లి కేంద్రంలో ఉమామహేశ్వరపురం, కోవూరుపల్లి పంచాయతీలకు నామినేషన్లు స్వీకరిస్తారు.

కడనూతల కేంద్రంలో బిట్రగుంట, అల్లిమడుగు, ముంగమూరు పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తారు.

జువ్వలదిన్నె కేంద్రంలో జువ్వలదిన్నె, ఎస్.వి.పాలెం, ఏనుగులబావి, చెన్నారాయునిపాలెం గ్రామాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఎంపీడీవో సుబ్రమణ్యం తెలిపారు.

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *