Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

బోగోలు బజార్లో నాలుగు రోడ్ల కూడలిలో వెలగని వీధి దీపాలు

Punnami Newsroom Published:
బోగోలు బజార్లో నాలుగు రోడ్ల కూడలిలో వెలగని వీధి దీపాలు

చీకటితో కొనుగోలుదారులకు ఇబ్బందులు.. వీధిదీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని వ్యాపారులు, స్థానికుల విజ్ఞప్తి

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బోగోలు: బోగోలు బజారులో గేటుకు తూర్పు వైపున ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన వీధిదీపాలు వెలగడం లేదు. దీంతో రాత్రి వేళల్లో ఆ ప్రాంతం చీకటిమయంగా మారుతోంది. ఫలితంగా వ్యాపారులు, స్థానికులతో పాటు కొనుగోళ్ల కోసం బజారుకు వచ్చే వినియోగదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వీధిదీపాలు పనిచేయకపోవడంతో దుకాణాలకు వచ్చే కస్టమర్లు చీకటిలో రాకపోకలు సాగించాల్సి వస్తోందని వ్యాపారులు తెలిపారు. ఈ సమస్యపై గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి వీధిదీపాలకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రజాప్రతినిధులు కూడా ఈ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపి, వీధిదీపాలు తిరిగి వెలిగేలా చర్యలు తీసుకోవాలని వ్యాపారులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

బోగోలు బజార్లో నాలుగు రోడ్ల కూడలిలో వెలగని వీధి దీపాలు

బోగోలు బజార్లో నాలుగు రోడ్ల కూడలిలో వెలగని వీధి దీపాలు

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *