Wednesday, 11 March 2026
  • Home  
  • బుచ్చి పట్టణ అభివృద్ధికి సహకరిస్తా: నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
- Featured

బుచ్చి పట్టణ అభివృద్ధికి సహకరిస్తా: నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

బుచ్చి పట్టణ అభివృద్ధికి సహకరిస్తా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుచ్చి పట్టణ అభివృద్ధికి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి కృషి చేస్తానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుచ్చి మున్సిపల్ చైర్ పర్సన్ సుప్రజ తోపాటు వార్డు కౌన్సిలర్లు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని శుక్రవారం సాయంత్రం ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చి మండలం తో తనకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాలతోపాటు బుచ్చి పట్టణ అభివృద్ధికి నిధులను సైతం అందజేస్తామన్నారు. కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు వారి వార్డుల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బుచ్చి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఎంపీ ఆదాలను గజమాలతో సత్కరించారు. జొన్నవాడ దేవస్థానం చైర్మన్ పుట్ట సుబ్రమణ్యం నాయుడు, విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, సయ్యద్ ఫయాజుద్దీన్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

బుచ్చి పట్టణ అభివృద్ధికి సహకరిస్తా

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

బుచ్చి పట్టణ అభివృద్ధికి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి కృషి చేస్తానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుచ్చి మున్సిపల్ చైర్ పర్సన్ సుప్రజ తోపాటు వార్డు కౌన్సిలర్లు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని శుక్రవారం సాయంత్రం ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చి మండలం తో తనకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాలతోపాటు బుచ్చి పట్టణ అభివృద్ధికి నిధులను సైతం అందజేస్తామన్నారు. కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు వారి వార్డుల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బుచ్చి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఎంపీ ఆదాలను గజమాలతో సత్కరించారు. జొన్నవాడ దేవస్థానం చైర్మన్ పుట్ట సుబ్రమణ్యం నాయుడు, విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, సయ్యద్ ఫయాజుద్దీన్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.