Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బాలుర ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం…….

అనపర్తి 17- 8 -2026 తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వారి ఆదేశముల మేరకు ఈస్ట్ జోన్ ఈగల్ టీం (ఎలైట్ యాంటీనార్కటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ ఫోర్స్ మెంట్ ) శ్రీ రామారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది.పాఠశాల ప్రధానోపాధ్యాయులు పులగం వెంకటరెడ్డి అధ్యక్షతన డ్రగ్స్ అవేర్నెస్ సమావేశం ఏర్పాటు చేయబడింది.ఈ సందర్భంగా ఏ.ఎస్ఐ.అప్పారావు మాట్లాడుతూ.. పాఠశాల అయిపోయిన తర్వాత 6,,7 గంటల సమయంలో పాఠశాల పరిసర ప్రాంతంలో కొందరు ఆకతాయిలు గంజాయి, డ్రగ్స్ తీసుకుంటున్నారని, అటువంటివారు ఎవరైనా కనిపిస్తే ఈ 89 77 78 19 72 వాట్సాప్ నెంబరుకు కానీ,1972 టోల్ ఫ్రీ నెంబర్ కు కానీ ఫోన్ చేయాలని తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ..తెలియజేసిన వారి పేర్లు కానీ, నెంబర్లు కానీ గోప్యంగా ఉంచబడతాయని,కాబట్టి ఎవరు భయపడాల్సిన పనిలేదని,ఇది మీ తల్లిదండ్రులకు కూడా చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కే.సత్యనారాయణ,కానిస్టేబుల్స్ టి.భాస్కర్, ఎన్. నరేష్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *