అంతర్జాతీయ బాలిక దినోత్సవ వారోత్సవాల ముగింపు కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ “ఒక విద్యావంతురాలైన బాలిక ఒక కుటుంబానికే కాకుండా సమాజానికే వెలుగునిస్తుంది. అందుకే ప్రతి బాలిక కూడా చదువులో రాణించి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి” అన్నారు. ఈ సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, (ఐ సి డి స్) సూపర్వైజర్లు వసుంధరమ్మ, సురేఖ రాణి బాలికలు సరోజినీ నాయుడు, కల్పనా చావ్లా, పీవీ సింధు లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.

బాలికలు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – సిఐ వెంకటేశ్వర్లు