Friday, 27 March 2026
  • Home  
  • *బస్సులు నడవొద్దు.. షాపులు తెరవొద్దు.. బంద్‎కు సహకరించాలని బీసీ జేఏసీ పిలుపు*
- తెలంగాణ

*బస్సులు నడవొద్దు.. షాపులు తెరవొద్దు.. బంద్‎కు సహకరించాలని బీసీ జేఏసీ పిలుపు*

పున్నమి న్యూస్ అక్టోబర్ 14 బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్‎ను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. బస్సులు నడవొద్దు.. విద్యాసంస్థలు తెరవొద్దు.. వ్యాపార సముదాయాలు స్వచ్చందంగా బంద్ చేయాలని కోరింది. గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బంద్‎కు సంబంధించిన వాల్ పోస్టర్‎ను జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య , వైస్ చైర్మన్ వీజీఆర్ నారగొని, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ , కో చైర్మెన్ రాజారామ్ యాదవ్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ బంద్ తో బీసీల సెగ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసేలా బీసీలు కదిలిరావలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ యాజమాన్యంతో పాటు, విద్యాసంస్థలు , వ్యాపార సముదాయాలు స్వచ్చందంగా బంద్ కు సహకరించాలని కోరారు. బంద్ కు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీ నాయకులను కలుస్తామన్నారు. మద్దతు ఇవ్వని పార్టీలకు బీసీల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. జేఏసీ నాయకులు గుజ్జ కృష్ణ , గుజ్జ సత్యం, కుందారపు గణేష్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్, వేముల రామకృష్ణ , నీల వెంకటేశ్, శ్యామ్ కుర్మ , విజయ్, లింగం గౌడ్, జిల్లపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు…. Video: https://punnami.in/%20బస్సులు%20నడపొద్దు

పున్నమి న్యూస్ అక్టోబర్ 14

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్‎ను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ జేఏసీ పిలుపునిచ్చింది.

బస్సులు నడవొద్దు.. విద్యాసంస్థలు తెరవొద్దు.. వ్యాపార సముదాయాలు స్వచ్చందంగా బంద్ చేయాలని కోరింది. గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బంద్‎కు సంబంధించిన వాల్ పోస్టర్‎ను జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య , వైస్ చైర్మన్ వీజీఆర్ నారగొని, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ , కో చైర్మెన్ రాజారామ్ యాదవ్ కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ బంద్ తో బీసీల సెగ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసేలా బీసీలు కదిలిరావలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ యాజమాన్యంతో పాటు, విద్యాసంస్థలు , వ్యాపార సముదాయాలు స్వచ్చందంగా బంద్ కు సహకరించాలని కోరారు.

బంద్ కు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీ నాయకులను కలుస్తామన్నారు. మద్దతు ఇవ్వని పార్టీలకు బీసీల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. జేఏసీ నాయకులు గుజ్జ కృష్ణ , గుజ్జ సత్యం, కుందారపు గణేష్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్, వేముల రామకృష్ణ , నీల వెంకటేశ్, శ్యామ్ కుర్మ , విజయ్, లింగం గౌడ్, జిల్లపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు….

Video: https://punnami.in/%20బస్సులు%20నడపొద్దు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.