Story highlights
- చిన్న వర్షానికే బురదమయం..
- తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తుల డిమాండ్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు పంచాయతీ పరిధిలోని బసవరాజుపాలెం నుంచి మహిమలూరుకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది.
- గుంతలమయమైన రోడ్డుపై చిన్నపాటి వర్షం కురిసినా బురద పేరుకుపోయి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంటోంది.
చిన్న వర్షానికే బురదమయం.. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తుల డిమాండ్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు పంచాయతీ పరిధిలోని బసవరాజుపాలెం నుంచి మహిమలూరుకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. గుంతలమయమైన రోడ్డుపై చిన్నపాటి వర్షం కురిసినా బురద పేరుకుపోయి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంటోంది. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో రాకపోకలు మరింత కష్టంగా మారుతున్నాయి. ప్రజల అవస్థలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని, శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.