“లో వోల్టేజ్‌తో గ్రామం చీకట్లో… అధికారుల నిర్లక్ష్యం ఇంకెన్నాళ్లు …
పున్నమి న్యూస్ ప్రతినిధి
10 ఏప్రిల్ 2026
తెలంగాణ ఇంచార్జ్
రంగారెడ్డి జిల్లా
బల్బ్ వెలగదు… మోటార్ నడవదు… నక్కర్త మేడిపల్లిలో కరెంటు కష్టాలు!”
పేరు కు మాత్రమే విద్యుత్… వోల్టేజ్ తో ప్రజల జీవితం అస్తవ్యస్తం”
నక్కర్త మేడిపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. గ్రామంలో సరైన వోల్టేజ్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బల్బులు వెలగకపోవడం, ఫ్యాన్లు తిరగకపోవడం, మోటార్లు పనిచేయకపోవడం వంటి సమస్యలు నిత్యకృత్యంగా మారాయి.
ప్రత్యేకంగా రాత్రి సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. పిల్లలు చదువుకోలేకపోవడం, వృద్ధులు ఇబ్బందులు పడటం వంటి సమస్యలు అధికమయ్యాయి.
గ్రామ ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. పాత విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ లోపాలు ఈ సమస్యకు కారణమని స్థానికులు అంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే చర్యలు తీసుకుని గ్రామానికి సరైన వోల్టేజ్ సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




