Sunday, 22 March 2026
  • Home  
  • బడ్జెట్‌లో ఖమ్మం జిల్లాకు గుండు సున్నా.. తెలంగాణ బడ్జెట్‌పై బీజేపీ నేత దేవకీ వాసు దేవా రావు ఆగ్రహం
- ఖమ్మం

బడ్జెట్‌లో ఖమ్మం జిల్లాకు గుండు సున్నా.. తెలంగాణ బడ్జెట్‌పై బీజేపీ నేత దేవకీ వాసు దేవా రావు ఆగ్రహం

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి): తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో ఖమ్మం జిల్లాకు అన్యాయం జరిగిందని బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర బీజేపీ కోశాధికారి దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ “ఆలీబాబా అరడజన్ పథకాలు” లా ఉందని, ప్రజలను మోసం చేసే పిట్ట కథలతో సమానమని విమర్శించారు. ఖమ్మం జిల్లాకు బడ్జెట్‌లో గుండు సున్నా మాత్రమే దక్కిందని, ముగ్గురు మంత్రులు ఉన్నా జిల్లాకు నిధులు తీసుకురాలేకపోయారని అన్నారు. ఇచ్చిన హామీలకు అవసరమైన ఖర్చు కంటే తక్కువ ఆదాయం ఉండటంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో ఖమ్మం ప్రజలు ఈ విషయాన్ని గమనించి తగిన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

ఖమ్మం, మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి):

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో ఖమ్మం జిల్లాకు అన్యాయం జరిగిందని బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర బీజేపీ కోశాధికారి దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ “ఆలీబాబా అరడజన్ పథకాలు” లా ఉందని, ప్రజలను మోసం చేసే పిట్ట కథలతో సమానమని విమర్శించారు. ఖమ్మం జిల్లాకు బడ్జెట్‌లో గుండు సున్నా మాత్రమే దక్కిందని, ముగ్గురు మంత్రులు ఉన్నా జిల్లాకు నిధులు తీసుకురాలేకపోయారని అన్నారు.

ఇచ్చిన హామీలకు అవసరమైన ఖర్చు కంటే తక్కువ ఆదాయం ఉండటంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో ఖమ్మం ప్రజలు ఈ విషయాన్ని గమనించి తగిన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.