ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ జిల్లా బార్ కౌన్సిల్‌కు చెందిన బంజారా న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బంజారా న్యాయవాదులు ఎదుర్కొంటున్న వృత్తి సంబంధిత సమస్యలు, అలాగే స్థానికంగా బంజారా సమాజానికి జరుగుతున్న అన్యాయాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
సమాజానికి న్యాయం జరిగే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కమిషన్ సభ్యుడి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన హుస్సేన్ నాయక్ సమస్యలను పరిశీలించి తగిన స్థాయిలో పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో న్యాయ వాదులతొ పాటు
బీజేపీ నాయకులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు కోటేశ్వరరావు, జాటోతూ మధు నాయక్ తదితరులు పాల్గొన్నారు.


