ప్రొద్దుటూరులో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను బహిరంగంగానే వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారు.
రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలు, టీస్టాళ్ళు, క్యాటరింగ్ సెంటర్లలో విచ్చలవిడిగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాడుతున్నారు. స్థానిక గ్యాస్ ఏజెన్సీలు గృహ వినియోగ సిలిండర్లను అధిక ధరలకు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఈ దోపిడీపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గృహ వినియోగదారులు కోరుతున్నారు.


