✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
గోపాలపురం మండలం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
ప్రవాస భారతీయుల దినోత్సవం *(జనవరి 9)* సందర్భంగా మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారు *ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రవాస సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.* ప్రవాస భారతీయులు కేవలం విదేశాల్లో నివసించే వారు మాత్రమే కాక, *ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్న శక్తి అని ఆయన అన్నారు.*
పెట్టుబడులు, నైపుణ్యాల మార్పిడి, విద్య, వైద్యం, సాంకేతికత, పరిశ్రమల రంగాల్లో ప్రవాసుల అనుభవం రాష్ట్ర పురోగతికి బలమైన పునాదిగా మారుతోందని పేర్కొన్నారు. *ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ పాలసీలు, పరిశ్రమలకు అనుకూల వాతావరణం, పారదర్శక పాలనతో ఆంధ్రప్రదేశ్ నేడు ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని తెలిపారు.*
అదేవిధంగా, రాష్ట్ర పర్యాటక రంగం ఒక కొత్త దిశలో ముందుకు సాగుతోందని మంత్రి గారు అన్నారు. సముద్ర తీరాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, వారసత్వ సంపదతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను *గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడంలో ప్రవాసుల అంతర్జాతీయ అనుభవం కీలకమని పేర్కొన్నారు.* పెట్టుబడులతో పాటు, *పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెస్టినేషన్ ప్రమోషన్, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లతో అనుసంధానం ద్వారా ప్రవాసులు రాష్ట్రానికి విలువైన భాగస్వాములుగా నిలవగలరని తెలిపారు.* హోటల్స్, రిసార్ట్స్, ఈకో, మెడికల్ & వెల్నెస్ టూరిజం రంగాల్లో వారి భాగస్వామ్యం ఉపాధి సృష్టికి, స్థానిక ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
*“మీ మూలాలు ఇక్కడే – మీ భాగస్వామ్యం కూడా ఇక్కడే”*
అనే భావనతో ప్రవాసులు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి–పర్యాటకం – ఉపాధి రంగాల్లో ప్రభుత్వం–ప్రవాసులు కలిసి ఒక బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించుకుందామని మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారు పిలుపునిచ్చారు.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు “గౌ.కందుల దుర్గేష్” గారి కార్యాలయం (నిడదవోలు)
END


