Sunday, 29 March 2026
  • Home  
  • ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం అవగాహన ర్యాలీ – గ్రామంలో చైతన్యం నింపిన విద్యా ప్రచారం..!
- అనకాపల్లి

ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం అవగాహన ర్యాలీ – గ్రామంలో చైతన్యం నింపిన విద్యా ప్రచారం..!

అనకాపల్లి జిల్లా మార్చి 29 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్): ఎటికొప్పాక గ్రామంలో ఉన్న MPP మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు కలిసి గ్రామంలో ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్.ఎం జగన్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న నాణ్యమైన విద్య, ఉచిత సదుపాయాలు, మంచి భవిష్యత్తుకు దారి చూపుతాయని తెలిపారు. గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ చైర్మన్, కూటమి నాయకులు, కాండ్రకోట చిరంజీవి, అన్నం సరోజ రావు, ఊడి రామకృష్ణ, కొండయ్య నాయుడు, భజంత్రీల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు, యువకులు మరియు స్కూల్ పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ర్యాలీ ద్వారా గ్రామంలో విద్యపై అవగాహన పెరిగి, అడ్మిషన్లపై మంచి స్పందన రావడం విశేషం. Uploaded Video:

అనకాపల్లి జిల్లా మార్చి 29 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్): ఎటికొప్పాక గ్రామంలో ఉన్న MPP మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు కలిసి గ్రామంలో ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా స్కూల్ హెచ్.ఎం జగన్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న నాణ్యమైన విద్య, ఉచిత సదుపాయాలు, మంచి భవిష్యత్తుకు దారి చూపుతాయని తెలిపారు. గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ చైర్మన్, కూటమి నాయకులు, కాండ్రకోట చిరంజీవి, అన్నం సరోజ రావు, ఊడి రామకృష్ణ, కొండయ్య నాయుడు, భజంత్రీల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు, యువకులు మరియు స్కూల్ పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ ర్యాలీ ద్వారా గ్రామంలో విద్యపై అవగాహన పెరిగి, అడ్మిషన్లపై మంచి స్పందన రావడం విశేషం.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.