Wednesday, 8 April 2026
  • Home  
  • ప్రభుత్వ ఆసుపత్రి లో భద్రతా వైఫల్యం – వరుస దొంగతనాలతో ప్రజల్లో భయం బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకటనారాయణ తీవ్ర ఆందోళన:
- ఖమ్మం

ప్రభుత్వ ఆసుపత్రి లో భద్రతా వైఫల్యం – వరుస దొంగతనాలతో ప్రజల్లో భయం బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకటనారాయణ తీవ్ర ఆందోళన:

ఖమ్మం ఏప్రిల్ ( పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల చోరీలు సాధారణ ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నాయి. అనారోగ్యంతో ఆసుపత్రిని ఆశ్రయించే రోగులు, వారి బంధువులు వాహనాలు సురక్షితంగా ఉంచే స్థలం కూడా లేక ఇబ్బందులు పడుతుండటం ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా? అన్న అనుమానాలకు తావిస్తోంది. బుధవారం ఈ సమస్యపై ఆసుపత్రి ఆవరణలో బీజేపీ ఆందోళన నిర్వహించిన బీజేపీ శ్రేణులు కార్యక్రమం లో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ మాట్లాడుతూ వాహనాలు చోరీకి గురైతే రోగులు పడే మానసిక వేదన, ఆర్థిక భారం ఎవరు భరిస్తారు?” అంటూ ప్రశ్నించారు ఆసుపత్రి లోపల సీసీ కెమెరాలు ఉన్నట్టే ఉన్నప్పటికీ, అవి పనిచేయడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. కెమెరాలు పనిచేయనివి అన్న విషయం ఆసుపత్రి వర్గాలకే ముందుగా ఎలా తెలిసిందన్న అనుమానం కూడా అయన వ్యక్తం చేశారు. మునుపు టోకెన్ సిస్టమ్ ఉండేది. రద్దీ లేకుండా పార్కింగ్ నిర్వహించేవారు. కానీ, పార్కింగ్ కాంట్రాక్టర్ లీజ్ తీసుకున్న తర్వాత పరిస్థితి మారిపోయిందని ఆయన అన్నారు. ఒక్కరోజులోనే మూడు వాహనాలు చోరీకి గురవడం ఆసుపత్రి ఆవరణ భద్రతపై మరింత అనుమానాలు పెంచుతోందన్నారు. జర్నలిస్టులు, ఆసుపత్రి సిబ్బంది వాహనాలే సురక్షితంగా లేకపోతే సాధారణ ప్రజలకు భద్రత ఎలా లభిస్తుందని ధనియాకుల వెంకట్ నారాయణ ప్రశ్నించారు. అనారోగ్యంతో వచ్చిన రోగులు, వారి కుటుంబాలు వాహనాల భయం కూడా భరించాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఆసుపత్రిలో నిఘా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అని ధనియాకలు వెంకటనారాయణ విమర్శించారు. పోలీసులు, ఆసుపత్రి అధికారులు కలిసి భద్రత కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆసుపత్రి ఆవరణలో వెంటనే పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పార్కింగ్ వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. వాహనదారుల భద్రత కోసం అధికారులు వెంటనే దృష్టి పెట్టాలని , లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ధనియాకుల వెంకట్ నారాయణ. హెచ్చరించారు. అనంతరం హాస్పిటల్ సూపర్ఇంటెండ్ అధికారి కి వినతి పత్రం సమర్పించారు. ఈ సమస్య లని త్వరలో నే పరిష్కారసిస్తాము అని ఆయన బీజేపీ శ్రేణులు లకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో తాజనూత భద్రం, రుద్ర గాని మాధవ్, పాశం శ్రీనివాసరెడ్డి, ఈశ్వర ప్రగడ, లలిత దాసరి, వీరభద్రం, ఇనుగుర్తి ఉపేంద్ర, శ్రీజర్ల వెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఖమ్మం ఏప్రిల్

( పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా ఇంచార్జి )

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల చోరీలు సాధారణ ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నాయి. అనారోగ్యంతో ఆసుపత్రిని ఆశ్రయించే రోగులు, వారి బంధువులు వాహనాలు సురక్షితంగా ఉంచే స్థలం కూడా లేక ఇబ్బందులు పడుతుండటం ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా? అన్న అనుమానాలకు తావిస్తోంది.

బుధవారం ఈ సమస్యపై ఆసుపత్రి ఆవరణలో బీజేపీ ఆందోళన నిర్వహించిన బీజేపీ శ్రేణులు కార్యక్రమం లో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ మాట్లాడుతూ
వాహనాలు చోరీకి గురైతే రోగులు పడే మానసిక వేదన, ఆర్థిక భారం ఎవరు భరిస్తారు?” అంటూ ప్రశ్నించారు
ఆసుపత్రి లోపల సీసీ కెమెరాలు ఉన్నట్టే ఉన్నప్పటికీ, అవి పనిచేయడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.
కెమెరాలు పనిచేయనివి అన్న విషయం ఆసుపత్రి వర్గాలకే ముందుగా ఎలా తెలిసిందన్న అనుమానం కూడా అయన వ్యక్తం చేశారు.
మునుపు టోకెన్ సిస్టమ్ ఉండేది. రద్దీ లేకుండా పార్కింగ్ నిర్వహించేవారు. కానీ, పార్కింగ్ కాంట్రాక్టర్ లీజ్ తీసుకున్న తర్వాత పరిస్థితి మారిపోయిందని ఆయన అన్నారు.
ఒక్కరోజులోనే మూడు వాహనాలు చోరీకి గురవడం ఆసుపత్రి ఆవరణ భద్రతపై మరింత అనుమానాలు పెంచుతోందన్నారు.
జర్నలిస్టులు, ఆసుపత్రి సిబ్బంది వాహనాలే సురక్షితంగా లేకపోతే సాధారణ ప్రజలకు భద్రత ఎలా లభిస్తుందని ధనియాకుల వెంకట్ నారాయణ ప్రశ్నించారు.
అనారోగ్యంతో వచ్చిన రోగులు, వారి కుటుంబాలు వాహనాల భయం కూడా భరించాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఆసుపత్రిలో నిఘా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అని ధనియాకలు వెంకటనారాయణ విమర్శించారు.
పోలీసులు, ఆసుపత్రి అధికారులు కలిసి భద్రత కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
ఆసుపత్రి ఆవరణలో వెంటనే పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పార్కింగ్ వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
వాహనదారుల భద్రత కోసం అధికారులు వెంటనే దృష్టి పెట్టాలని , లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ధనియాకుల వెంకట్ నారాయణ.
హెచ్చరించారు.
అనంతరం హాస్పిటల్ సూపర్ఇంటెండ్ అధికారి కి వినతి పత్రం సమర్పించారు.
ఈ సమస్య లని త్వరలో నే పరిష్కారసిస్తాము అని ఆయన బీజేపీ శ్రేణులు లకి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమం లో
తాజనూత భద్రం, రుద్ర గాని మాధవ్, పాశం శ్రీనివాసరెడ్డి, ఈశ్వర ప్రగడ, లలిత దాసరి, వీరభద్రం, ఇనుగుర్తి ఉపేంద్ర, శ్రీజర్ల వెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.