Thursday, 9 April 2026
  • Home  
  • ప్రపంచం దృష్టి ఇప్పుడు రాజమండ్రి వైపు..
- తూర్పు గోదావరి

ప్రపంచం దృష్టి ఇప్పుడు రాజమండ్రి వైపు..

సరిత్రాత్మక రాజమండ్రి నగరం అంతర్జాతీయ క్రీడా వేదికగా రూపుదిద్దుకోబోతోంది. ప్రపంచమంతా ఇప్పుడు రాజమహేంద్రవరం వైపు చూడబోతోంది… చైనా పురాతన క్రీడ డ్రాగన్ బోట్ పోటీలు త్వరలోనే రాజమహేంద్రవరంలో జరగబోతున్నాయి. భారతదేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడుతున్న ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్-2026 పోటీలు రాజమండ్రి కేంద్రంగా నిర్వహించనున్నట్లు ప్రజా ప్రతినిధులు, నిర్వాహకులు తెలిపారు. థింక్ అవుట్ సైడ్, ఇండియన్ కయాకింగ్ అండ్ కానోయింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మే 30, 31, జూన్ 1 తేదీల్లో జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, శాప్ చైర్మన్ అనిమీని రవి నాయుడు ఆవిష్కరించగా, జెర్సీని బలరాం నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బొడ్డు వెంకటరమణ చౌదరి ఆవిష్కరించారు. టీజర్‌ను ఎమ్మెల్సీ సోము వీర్రాజు విడుదల చేశారు. అధికారిక బ్యానర్‌ను నాయకులు విడుదల చేశారు. అలాగే థింక్ ఔట్సైడ్ యోగేష్, శిల్ప, బొడ్డు వెంకటరమణ చౌదరి కలిసి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. సోషల్ మీడియా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.చైనా నుంచి ఆవిర్భవించిన డ్రాగన్ బోట్ క్రీడ :డ్రాగన్ బోట్ క్రీడకు దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. చైనాలో క్వ్ యువాన్ అనే కవి జల సమాధి అయిన తరువాత, ప్రజలు పడవలతో ఆయనను వెతుకుతూ డప్పులు కొడుతూ సాగిన సంప్రదాయం ఈ క్రీడగా మారింది. టీమ్ స్పిరిట్, సమన్వయం, ఏకాగ్రతకు ప్రతీకగా ఈ క్రీడ నిలుస్తుంది.ఈవెంట్ లాంచ్ అనంతరం ప్రజా ప్రతినిధుల ప్రసంగాలు :రాజమండ్రి స్పోర్ట్స్ హబ్‌గా మారే దిశగా అడుగులు : ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిరాజమండ్రి ఇప్పటివరకు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందిందని, ఇప్పుడు స్పోర్ట్స్ హబ్‌గా మారబోతోందని ఎంపీ దగ్గుబాటి పురంధ్వేరి అన్నారు. ఈ క్రీడ యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచి ఆరోగ్యవంతమైన జీవనశైలికి దారితీస్తుందని పేర్కొన్నారు. మల్టీ పర్పస్ స్టేడియంను మూడు దశల్లో నిర్మిస్తున్నామని వెల్లడించారు.క్రీడా రాజధానిగా రాజమండ్రి : ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్రాజమండ్రిని క్రీడా రాజధానిగా తీర్చిదిద్దేందుకు అన్ని అర్హతలు ఉన్నాయ న్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నారాయణపురంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించామని, గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నంలో భాగంగానే రాజమహేంద్రవరాన్ని పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేసే ప్రక్రియ వేగంగా సాగుతోందన్నారు. క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు నాందిగా ఈ అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ సంబరాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ దేశాలకు చెందిన వందలాది మంది క్రీడాకారులు వస్తున్న తరుణంలో నగర ప్రజలు అపూర్వ రీతిలో స్వాగతం పలికేందుకు సిద్ధం కావాలని ఆయన కోరారు. మొత్తంగా ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ -2026 రాజమండ్రి నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే మహత్తర అవకాశమన్నారు. ప్రజల సహకారం ఉంటే భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ క్రీడలను నిర్వహించే సామర్థ్యం రాజమండ్రికి ఉందన్నారు.వాటర్ గేమ్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం : రవి నాయుడురాజమండ్రిని వాటర్ గేమ్స్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని శాప్ చైర్మన్ అనిమీని రవి నాయుడు చెప్పారు. ఈ ఈవెంట్‌లో 25 దేశాల అథ్లెట్లు పాల్గొనడం గర్వకారణమని, రూ.53 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. క్రీడల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు.కేంద్రం నుంచి భారీ నిధులు : సోము వీర్రాజుఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి క్రీడా రంగంలో పూర్తి మద్దతు ఇస్తోందని అన్నారు. ఎంపీ పురంధేశ్వరి కృషితో మల్టీ పర్పస్ స్టేడియంకు రూ.54 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. రాజమండ్రి క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ముందుకు సాగడం ఆనందకరమన్నారు.పర్యాటక రంగానికి ఊతం : బొడ్డు వెంకట రమణ చౌదరిరుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ఈ అంతర్జాతీయ ఈవెంట్ ద్వారా రాజమండ్రి పర్యాటక, క్రీడా రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయని చెప్పారు. పెద్ద సంఖ్యలో పెట్టుబడులు రానున్నాయని, స్థానిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రే శ్రీనివాసరావు, పిక్కి నాగేంద్ర, అత్తి సత్యనారాయణ, వై శ్రీను, ఉప్పులూరి జానకీ రామయ్య, అధిక సంఖ్యలో సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్లు తదితరులు పాల్గొన్నారు.

సరిత్రాత్మక రాజమండ్రి నగరం అంతర్జాతీయ క్రీడా వేదికగా రూపుదిద్దుకోబోతోంది. ప్రపంచమంతా ఇప్పుడు రాజమహేంద్రవరం వైపు చూడబోతోంది… చైనా పురాతన క్రీడ డ్రాగన్ బోట్ పోటీలు త్వరలోనే రాజమహేంద్రవరంలో జరగబోతున్నాయి. భారతదేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడుతున్న ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్-2026 పోటీలు రాజమండ్రి కేంద్రంగా నిర్వహించనున్నట్లు ప్రజా ప్రతినిధులు, నిర్వాహకులు తెలిపారు.
థింక్ అవుట్ సైడ్, ఇండియన్ కయాకింగ్ అండ్ కానోయింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మే 30, 31, జూన్ 1 తేదీల్లో జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, శాప్ చైర్మన్ అనిమీని రవి నాయుడు ఆవిష్కరించగా, జెర్సీని బలరాం నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బొడ్డు వెంకటరమణ చౌదరి ఆవిష్కరించారు. టీజర్‌ను ఎమ్మెల్సీ సోము వీర్రాజు విడుదల చేశారు. అధికారిక బ్యానర్‌ను నాయకులు విడుదల చేశారు. అలాగే థింక్ ఔట్సైడ్ యోగేష్, శిల్ప, బొడ్డు వెంకటరమణ చౌదరి కలిసి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. సోషల్ మీడియా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.చైనా నుంచి ఆవిర్భవించిన డ్రాగన్ బోట్ క్రీడ :డ్రాగన్ బోట్ క్రీడకు దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. చైనాలో క్వ్ యువాన్ అనే కవి జల సమాధి అయిన తరువాత, ప్రజలు పడవలతో ఆయనను వెతుకుతూ డప్పులు కొడుతూ సాగిన సంప్రదాయం ఈ క్రీడగా మారింది. టీమ్ స్పిరిట్, సమన్వయం, ఏకాగ్రతకు ప్రతీకగా ఈ క్రీడ నిలుస్తుంది.ఈవెంట్ లాంచ్ అనంతరం ప్రజా ప్రతినిధుల ప్రసంగాలు
:రాజమండ్రి స్పోర్ట్స్ హబ్‌గా మారే దిశగా అడుగులు : ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిరాజమండ్రి ఇప్పటివరకు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందిందని, ఇప్పుడు స్పోర్ట్స్ హబ్‌గా మారబోతోందని ఎంపీ దగ్గుబాటి పురంధ్వేరి అన్నారు. ఈ క్రీడ యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచి ఆరోగ్యవంతమైన జీవనశైలికి దారితీస్తుందని పేర్కొన్నారు. మల్టీ పర్పస్ స్టేడియంను మూడు దశల్లో నిర్మిస్తున్నామని వెల్లడించారు.క్రీడా రాజధానిగా రాజమండ్రి : ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్రాజమండ్రిని క్రీడా రాజధానిగా తీర్చిదిద్దేందుకు అన్ని అర్హతలు ఉన్నాయ న్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నారాయణపురంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించామని, గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నంలో భాగంగానే రాజమహేంద్రవరాన్ని పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేసే ప్రక్రియ వేగంగా సాగుతోందన్నారు. క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు నాందిగా ఈ అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ సంబరాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ దేశాలకు చెందిన వందలాది మంది క్రీడాకారులు వస్తున్న తరుణంలో నగర ప్రజలు అపూర్వ రీతిలో స్వాగతం పలికేందుకు సిద్ధం కావాలని ఆయన కోరారు. మొత్తంగా ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ -2026 రాజమండ్రి నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే మహత్తర అవకాశమన్నారు. ప్రజల సహకారం ఉంటే భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ క్రీడలను నిర్వహించే సామర్థ్యం రాజమండ్రికి ఉందన్నారు.వాటర్ గేమ్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం : రవి నాయుడురాజమండ్రిని వాటర్ గేమ్స్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని శాప్ చైర్మన్ అనిమీని రవి నాయుడు చెప్పారు. ఈ ఈవెంట్‌లో 25 దేశాల అథ్లెట్లు పాల్గొనడం గర్వకారణమని, రూ.53 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. క్రీడల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు.కేంద్రం నుంచి భారీ నిధులు : సోము వీర్రాజుఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి క్రీడా రంగంలో పూర్తి మద్దతు ఇస్తోందని అన్నారు. ఎంపీ పురంధేశ్వరి కృషితో మల్టీ పర్పస్ స్టేడియంకు రూ.54 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. రాజమండ్రి క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ముందుకు సాగడం ఆనందకరమన్నారు.పర్యాటక
రంగానికి ఊతం : బొడ్డు వెంకట రమణ చౌదరిరుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ఈ అంతర్జాతీయ ఈవెంట్ ద్వారా రాజమండ్రి పర్యాటక, క్రీడా రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయని చెప్పారు. పెద్ద సంఖ్యలో పెట్టుబడులు రానున్నాయని, స్థానిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రే శ్రీనివాసరావు, పిక్కి నాగేంద్ర, అత్తి సత్యనారాయణ, వై శ్రీను, ఉప్పులూరి జానకీ రామయ్య, అధిక సంఖ్యలో సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.