ఖమ్మం
(పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి)
ప్రచారం ముగింపు సమయం దగ్గర పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వాములుగా ఉన్నప్పటికీ, ఖమ్మం జిల్లాలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. నిన్న సత్తుపల్లిలో జరిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ర్యాలీలో వైసీపీ, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ జెండాలు ఒకేచోట కనిపించడంపై ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అవకాశవాద రాజకీయాలు ఈ స్థాయికి దిగజారడం సిగ్గుమాలిన చర్యగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఈ పరిణామాలు బీజేపీకి కలిసి వచ్చే అవకాశముందని, ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీకి పట్టం కట్టాలన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా, 13వ తేదీన అభ్యర్థుల విజయం–పరాజయాలను ప్రజలే తేల్చనున్నారు.



