పోలీసు అమరవీరుల వారోత్స వాలను పురస్కరించుకొని నందిగామ పట్టణంలోని కమ్మ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఆర్డీవో (RD) ప్రారంభించారు. పలువురు రక్తదాతలకు సర్టిఫికెట్లు కూడా అందజేయబడినాయి.
ఏసీపీ తిలక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “రక్తదానం ప్రాణదానంతో సమానం” అని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని, పోలీసు అమరవీరుల సేవలను నిరంతరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు ఆరు నెలలకు ఒక్కసారి రక్తదానం చేయాలన్నారు.
రక్తదాన శిబిరంలో పాల్గొన్న నందిగామ పోలీస్ స్టేషన్ సిఐ వైవిల్ నాయుడు, పోలీసులు, విద్యార్థులు, మరియు ఇతర రక్తదాతలకు ఏసీపీ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డీవో బాలకృష్ణ మాట్లాడుతూ, “పోలీసు అమర వీరుల స్మారక వారోత్సవాల సందర్భంలో ఇలాంటి రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా సమాజానికి సేవ చేయడమే కాకుండా, అమరవీరుల త్యాగా లను స్మరించడమనిభావించాలి. పోలీస్ సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొనడం అభినందనీయమే” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, ఆర్డీవో బాలకృష్ణ, సిఐ వైవియల్ నాయుడు, మున్సిపల్ చైర్మన్ కృష్ణకుమారి, ప్రభుత్వ హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు ఏచూరి రాము, మున్సిపల్ కమిషనర్ లోవరాజు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంలో రక్తదాన శిబిరం
పోలీసు అమరవీరుల వారోత్స వాలను పురస్కరించుకొని నందిగామ పట్టణంలోని కమ్మ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఆర్డీవో (RD) ప్రారంభించారు. పలువురు రక్తదాతలకు సర్టిఫికెట్లు కూడా అందజేయబడినాయి. ఏసీపీ తిలక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “రక్తదానం ప్రాణదానంతో సమానం” అని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని, పోలీసు అమరవీరుల సేవలను నిరంతరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు ఆరు నెలలకు ఒక్కసారి రక్తదానం చేయాలన్నారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న నందిగామ పోలీస్ స్టేషన్ సిఐ వైవిల్ నాయుడు, పోలీసులు, విద్యార్థులు, మరియు ఇతర రక్తదాతలకు ఏసీపీ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డీవో బాలకృష్ణ మాట్లాడుతూ, “పోలీసు అమర వీరుల స్మారక వారోత్సవాల సందర్భంలో ఇలాంటి రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా సమాజానికి సేవ చేయడమే కాకుండా, అమరవీరుల త్యాగా లను స్మరించడమనిభావించాలి. పోలీస్ సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొనడం అభినందనీయమే” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, ఆర్డీవో బాలకృష్ణ, సిఐ వైవియల్ నాయుడు, మున్సిపల్ చైర్మన్ కృష్ణకుమారి, ప్రభుత్వ హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు ఏచూరి రాము, మున్సిపల్ కమిషనర్ లోవరాజు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

