కామారెడ్డి, 26 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :
పోలీసులపై అసభ్యపదాలు… ఇద్దరు మద్య మత్తులో అరెస్ట్!రిమాండ్‌కు పంపారు. కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో పోలీస్ పరిధి లో భారీ ఘటన చోటుచేసుకుందని రామారెడ్డి ఎస్ఐ రాజశేఖర్ వెల్లడించారు. పెట్రోలింగ్‌లో ఉన్న కానిస్టేబుల్స్‌పై మద్యం మత్తులో ఇద్దరు రగిలే వాళ్లు అసభ్య పదాలతో దూషించి, విధులకు ఆటంకం కలిగించారు. వెంటనే కేసు చేసీ దర్యాప్తు చేసి కోర్టు జడ్జి ముందు నిలబెట్టి వాళ్లను బందీఖానాలో దించేశారు పోలీసులు 23-24 జనవరి 2026 రాత్రి ఇసన్నపల్లి గ్రామంలో పోలీసులు పేట్రోలింగ్ చేస్తుంటే… మద్యం మత్తులో మసూరి అనిల్ కుమార్, భూపల్లి రాజు అనే ఇద్దరు గ్రామ స్తులు దిట్టించి, అసభ్య పదజాలంతో దూషించా రు. విధులు చేయకుండా తోసివేసే ప్రయత్నం చేశారు. ఈ హీరోలందరూ ప్రజల రక్షణ కోసం పని చేస్తున్నారు కదా!పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. అక్కడే రిమాండ్‌కు పంపారు. నిందితులు: 1) మసూరి అనిల్ కుమార్ (ఇసన్నపల్లి), 2) భూపల్లి రాజు (ఇసన్నపల్లి). వీళ్లపై గతంలోనూ కేసులు ఉన్నవి! జిల్లా పోలీస్ శాఖ స్పష్టంగా హెచ్చరిక: పోలీసుల విధులకు ఆటంకం కలిగించితే చట్ట చర్యలు తప్పవని హెచ్ఛారించారు. ప్రజల రక్షణ, సమాజ శాంతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. అందరూ సహకరించండి అని విజ్ఞప్తి చేశారు.


