పేదవాడి సొంతింటి కల నిజం చేస్తున్న ప్రభుత్వం
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *
ఇళ్లు లేని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను నిజం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.
నియోజకవర్గంలో మొత్తం మంజూరైన 60 ఇళ్లకు సంబంధించి ఇంటి నిర్మాణం కోసం రెండున్నర లక్షల రూపాయలు అర్హులైన పేదవారు బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది.
ఈ సందర్భంగా 32 వ వార్డు కు చెందిన సింహాద్రి సుజాతకు ఇంటి మంజూరు పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటి నిర్మాణానికి సంబంధించి లక్షన్నర రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు సమకూరుస్తుందని చెప్పారు. ఈ మొత్తం అమౌంట్ను ఇంటి నిర్మాణదారుల బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరిగిందని పేర్కొన్నారు.
మొత్తం నియోజకవర్గంలో 60 మందికి ఇళ్లు మంజూరైన వారికి ఈ అమౌంట్ ను అందజేస్తున్నట్లు వెల్లడించారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ తన వార్డు అభివృద్ధికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేస్తున్న కృషిని కొనియాడారు.
పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజాన అప్పారావు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


