నంద్యాల ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పథకం కింద ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని . పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తూ, రాష్ట్రంలో కోట్లాది మంది పేదలకు గూడు కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు ఈ రోజు పేదల సొంతింటి కల సాకారమవుతున్న పండుగ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటిస్తుందని. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని అందులో భాగంగానే నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో సొంతింటి కలను నెరవేర్చుకున్న మారెళ్ళ వైష్ణవి (లబ్దిదారుని పేరు) భర్త పేరు మారెళ్ళ ఆదినారాయణ వారి ఇంటిని ఈరోజు అధికారులతో కలిసి మంత్రివర్యులు ఫరూక్ ప్రారంభించడం జరిగింది. అనంతరం నూతన గృహప్రవేశం చేసినందుకు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మారెళ్ళ వైష్ణవి, మారెళ్ళ ఆదినారాయణ కు నూతన వస్త్రములు అందజేయడం జరిగింది
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గత 16 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,85,557 గృహాలను పూర్తి చేయడం జరిగిందని ఇందులో ముఖ్యమంత్రి చొరవతో చేపట్టిన నిర్మాణాలు, PMAY, BLC, PMJM పథకాల కింద పూర్తైనవి ఉన్నాయన్నారు . గత 16 నెలల్లో దాదాపు 3 లక్షల ఇళ్ల పూర్తి చేసి పేదలకు తాళాలు అప్పగించడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నిర్మాణంలో ఆగిపోయి ఉన్న ఒక్క ఇళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారని . ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో ఇళ్ల నిర్మాణంలో వేగం పెరిగిందని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలకు ప్రభుత్వం వేడుకకు సిద్ధమవుతోందని తెలిపారు.
పూర్వ పాలకుల వైఫల్యాలు – ప్రస్తుత ప్రభుత్వం చొరవ
గత టీడీపీ ప్రభుత్వంలో (2014-19)లో పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు పట్టణాల్లో 1.5, గ్రామాలలో 2 సెంట్లు ఇచ్చి పేదల పెన్నిదిగా చంద్రబాబు నిలిస్తే దాన్ని సెంటుకే కుదించి పేదల ద్రోహిగా జగన్ రెడ్డి నిలిపోయాడని. 2014-19లో టిడ్కోతో కలిపి 12 లక్షల గృహాలను పూర్తి చేసి పేదలకు అందిస్తే జగన్ రెడ్డి మాత్రం ప్రచార ఆర్భాటం తప్పించి పేదలకు గృహాలను పూర్తి చేసి ఇచ్చింది లేదని పైగా NTR రూరల్ హౌసింగ్ లబ్ధిదారులకు రూ.920 కోట్ల బకాయిలా చెల్లించకుండా నిలిపివేశాడని అన్నారు. “ఇళ్లు కాదు, ఊళ్లే నిర్మిస్తాం” అని చెప్పి రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ ఏవి కల్పించకుండానే పెండింగ్ లోనే ఉన్న ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసి వైసీపీ నాయకులు చేతులు దులుపుకున్నారని. నేడు కూటమి ప్రభుత్వం ఇళ్లతో పాటు రోడ్లు, నీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు అందిస్తుందని. గత వైసీపీ ప్రభుత్వం పేదల కలలకు తాళం వేస్తే , కూటమి ప్రభుత్వం ఆ తాళం తెరిచి గౌరవంగా ఇల్లు ఇస్తుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో రూలర్ ఎమ్మార్వో శ్రీవాణి, ఎంపీడీఓ సుగుణ శ్రీ , డిప్యూటీ ఎంపీడీఓ నాగజ్యోతి, హోసింగ్ డిఈ విజయ బాబు , చాపిరేవుల గ్రామ టిడిపి నాయకులు భూపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి , సుబ్బారెడ్డి, సర్పంచ్ రాజు, సంజన , సుబ్బరాయుడు, మునిస్వామి, రాజశేఖర్, బిజ్జల శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


