సమాజంలో పేదరిక నిర్మూలన కేవలం విద్య తోనే సాధ్యం అని ఇన్ఫోసిస్ సంస్థ సేవా విభాగం మమత’ *కోఆర్డినేటర్ రాపాక స్వాతి* అన్నారు.
మంగళవారం ఉదయం జనగామ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు తమ సంస్థ తరఫున మూడు కంప్యూటర్లు వితరణ చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. సునంద అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వాతి మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం కింద తమ సంస్థ చేపట్టిన వితరణ కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ విద్యా సంస్థ లు ప్రత్యేకించి బాలికలు చదివే సంస్థల కు కంప్యూటర్స్ వితరణ చేస్తున్నట్లు తెలిపారు.
తన జన్మభూమి పై గల మమకారం తో తమ నాన్నగారు పుర ప్రముఖులు ఫజ్జూరి జయహరి కోరిక మేరకు ఈ కళాశాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమం *కోఆర్డినేటర్ స్వాతి భర్త రాపాక నాగరాజు మాట్లాడుతూ* ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నాయకురాలు సుధా నారాయణ మూర్తి ప్రోత్సాహంతో మన ప్రాంతంలో ఇప్పటివరకు పల్లగుట్ట, ములుగు, పాలకుర్తి, చిల్పూర్, రాయపర్తి పాఠశాలలకు కంప్యూటర్స్ వితరణ చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం లో విశిష్ఠ అతిథి గా పాల్గొన్న లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్న పరశురాములు మాట్లాడుతూ స్వాతి దంపతుల సేవా నిరతి, జన్మభూమి పై గల ప్రేమ ను అభినందించారు.
ఈ ప్రాంతంలో మరిన్ని పాఠశాలలకు తమ సేవలు విస్తరించాలని సూచించారు.
కార్యక్రమంలో కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు గట్టు వెంకన్న, పురప్రముఖులు అరుగుల శ్రీనివాస్, మహంకాళి హరిశ్చంద్ర గుప్త, బిజ్జల నవీన్, పి. నసింహారావు, గట్టు శ్రీనివాస్, ఆర్ . జగదీష్, మాశెట్టి సంతోష్, కళాశాల లెక్చరర్లు ఎస్. కృష్ణయ్య, వి. సంతోషి, సిహెచ్. ప్రభావతి, ఎన్. కృష్ణవేణి, జి. సిందూజ తదితరులు పాల్గొన్నారు


