తొట్టంబేడు, పున్నమి, న్యూస్, మార్చి 11: తొట్టంబేడు మండలం పెద్దకన్నలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిపై జరిగిన దాడి ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటకృష్ణ మంగళవారం సాయంత్రం 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సమయంలో తెలుగు ఉపాధ్యాయురాలు మహాలక్ష్మి కుమారుడు చైతన్య తనపై దాడి చేశాడని ఆరోపిస్తూ శ్రీకాళహస్తి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లిని అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ తనపై దాడికి పాల్పడ్డాడని ఆయన పోలీసులకు తెలిపారు. ఇదే ఘటనపై తెలుగు ఉపాధ్యాయురాలు మహాలక్ష్మి కూడా పోలీసులను ఆశ్రయిస్తూ, వెంకటకృష్ణ తనను కులం పేరుతో దూషించడమే కాకుండా వేధింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. తన కుమారుడు ఎలాంటి దాడి చేయలేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో పాఠశాలలో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం నాడు పాఠశాల ఎదుటకు చేరుకుని ఫిజిక్స్ ఉపాధ్యాయుడు వెంకటకృష్ణకు మద్దతుగా నిరసన చేపట్టారు. సౌమ్యుడు, వినయశీలి అయిన ఉపాధ్యాయుడిపై దాడి జరగడం అమానుషమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. “తెలుగు టీచర్ వద్దు – ఫిజిక్స్ టీచర్ ముద్దు” అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడు వెంకటకృష్ణకు తగిన న్యాయం జరగకపోతే ఉన్నతాధికారుల కార్యాలయాల ఎదుట కూడా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

పెద్దకన్నలి జడ్‌పి హైస్కూల్‌లో ఉద్రిక్తత – ఉపాధ్యాయుడికి మద్దతుగా విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన