Thursday, 26 March 2026
  • Home  
  • పాయకరావుపేటలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు… విద్యార్థుల్లో సంస్కార స్ఫూర్తి
- అనకాపల్లి

పాయకరావుపేటలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు… విద్యార్థుల్లో సంస్కార స్ఫూర్తి

అనకాపల్లి జిల్లా ఫిబ్రవరి 6 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ : పాయకరావుపేట నియోజకవర్గంలో ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైతిక విలువలు) బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. హోం మంత్రి వంగలపూడి అనిత గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన విద్యాదీప్తి – సంస్కార స్ఫూర్తి కార్యక్రమంలో చాగంటి గారు నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, గురు–తల్లిదండ్రుల గౌరవం, కష్టపడి చదవడం, దురలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు హితవు పలికారు. ఈ ప్రవచనాలు విద్యార్థుల్లో కొత్త ఆలోచనలకు, మంచి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేశాయి.

అనకాపల్లి జిల్లా ఫిబ్రవరి 6 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ :

పాయకరావుపేట నియోజకవర్గంలో ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైతిక విలువలు) బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. హోం మంత్రి వంగలపూడి అనిత గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన విద్యాదీప్తి – సంస్కార స్ఫూర్తి కార్యక్రమంలో చాగంటి గారు నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, గురు–తల్లిదండ్రుల గౌరవం, కష్టపడి చదవడం, దురలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు హితవు పలికారు. ఈ ప్రవచనాలు విద్యార్థుల్లో కొత్త ఆలోచనలకు, మంచి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేశాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.