ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి
జిల్లాలో ఆదివారం పండుగ వాతావరణం తలపించింది. తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వరుస శుభకార్యాల్లో పాల్గొని ప్రజలతో ఆత్మీయంగా మమేకమయ్యారు.
కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామంలో ఆదిత్య ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం, గంగమ్మతల్లి ఆలయంలో బోనాల జాతరలో పాల్గొని భక్తులతో కలిసిపోయారు. అనంతరం మల్లేపల్లిలోని బీఆర్కే ఫంక్షన్ హాల్లో పురం ఉపేందర్ కుమారుని వివాహం, నేలకొండపల్లి ఏఎంసీ మార్కెట్ యార్డులో చిలకల రాములు కుమారుని వివాహం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో వరుసగా జరిగిన పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, రిసెప్షన్లకు హాజరై ఆశీర్వచనాలు అందించారు.
వెంకటగిరిక్రాస్ రోడ్లోని శ్రీహర్ష కన్వెన్షన్, నాయుడుపేట పీవీఆర్ గార్డెన్స్, రెడ్డిపల్లి ఏఆర్ గార్డెన్స్, సత్యనారాయణపురం టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లలో జరిగిన వివాహ వేడుకల్లో పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు.
ఖమ్మం నగరంలోని రామన్నపేట, ఉషాహరి కన్వెన్షన్, సిటీ సెంట్రల్ కన్వెన్షన్, ఎస్ఆర్ కన్వెన్షన్, పుట్టకోటతో పాటు అనేక ప్రాంతాల్లో జరిగిన శుభకార్యాల్లోనూ పాల్గొన్నారు. శ్రీనగర్ కాలనీలో శెట్టిపల్లి వెంకటేశ్వర్లు మనమరాళ్ల ఓణీల అలంకరణ వేడుకలోనూ మమేకమయ్యారు.
ప్రతీ చోటా పట్టు వస్త్రాలను కానుకగా అందజేస్తూ.. ఆత్మీయత నిండిన ఆశీస్సులను మంత్రి పొంగులేటి వారికి అందించారు.


