పర్యాటకానికి చిరునామా విశాఖ
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- *
గురువారం సాయంత్రం రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేశ్ గారు TU 142 యుద్ద విమాన మ్యూజియం, అదే ఆవరణలో నూతనముగా ఏర్పాటుచేసిన *”మాయా వరల్డ్”* లను సందర్శించారు. తదుపరి మంత్రి వర్యులు శ్రీ కందుల దుర్గేశ్ గారు, VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు ఇరువురు ఇటీవలే ప్రారంభించిన హెలికాప్టర్ మ్యూజియం ను సందర్శించారు. ఈ సందర్భంగా హేలీ మ్యూజియం వివరాలను మంత్రికి VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు వివరించారు. విశాఖ కి వచ్చే పర్యాటకులను, సందర్శకులను ఆకర్షించేలా హేలీ మ్యూజియం ను అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. అలానే కైలాసగిరి పై త్రిశూల్ ప్రాజెక్ట్ ను వచ్చే శివరాత్రి నాటికి అందుబాటులో కి తీసుకువస్తామని, దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి ను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. విశాఖ అంటే పర్యాటకానికి చిరునామా గా తీర్చిదిద్దుతామని మంత్రికి వివరించారు. పర్యాటకులను ఆకర్షించేలా పలు ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చిన VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారిని పర్యాటక శాఖ మంత్రి వర్యులు శ్రీ కందుల దుర్గేశ్ గారు అభినందలు తెలిపి, ప్రశంసించారు. తదనంతరం మంత్రివర్యులు శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో VMRDA కి చెందిన అధికారులు, సిబ్బంది, *మాయా వరల్డ్* ప్రతినిధి రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పర్యాటకానికి చిరునామా విశాఖ
పర్యాటకానికి చిరునామా విశాఖ *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- * గురువారం సాయంత్రం రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేశ్ గారు TU 142 యుద్ద విమాన మ్యూజియం, అదే ఆవరణలో నూతనముగా ఏర్పాటుచేసిన *”మాయా వరల్డ్”* లను సందర్శించారు. తదుపరి మంత్రి వర్యులు శ్రీ కందుల దుర్గేశ్ గారు, VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు ఇరువురు ఇటీవలే ప్రారంభించిన హెలికాప్టర్ మ్యూజియం ను సందర్శించారు. ఈ సందర్భంగా హేలీ మ్యూజియం వివరాలను మంత్రికి VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు వివరించారు. విశాఖ కి వచ్చే పర్యాటకులను, సందర్శకులను ఆకర్షించేలా హేలీ మ్యూజియం ను అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. అలానే కైలాసగిరి పై త్రిశూల్ ప్రాజెక్ట్ ను వచ్చే శివరాత్రి నాటికి అందుబాటులో కి తీసుకువస్తామని, దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి ను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. విశాఖ అంటే పర్యాటకానికి చిరునామా గా తీర్చిదిద్దుతామని మంత్రికి వివరించారు. పర్యాటకులను ఆకర్షించేలా పలు ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చిన VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారిని పర్యాటక శాఖ మంత్రి వర్యులు శ్రీ కందుల దుర్గేశ్ గారు అభినందలు తెలిపి, ప్రశంసించారు. తదనంతరం మంత్రివర్యులు శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో VMRDA కి చెందిన అధికారులు, సిబ్బంది, *మాయా వరల్డ్* ప్రతినిధి రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

