పది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుబడ్డ సర్కిల్ -3 ఏ.ఎస్.వో టీ.
విశాఖపట్నం నవంబర్ 3 పున్నమి ప్రతినిధి:-
ఆరు నెలల క్రితం రేషన్ బియ్యంతో పట్టుబడిన రెండు ఆటోలని పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు వాటిని సీజ్ చేశారు.
పట్టుబడిన ఆటోలను విడుదల చేయమని హైకోర్టు ఆదేశాలు అనుసరంగా జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా భాధితుల పక్షాన ఆటోలు విడుదలకి సర్కిల్ -3 ఏ.ఎస్.వో కృష్ణకి ఆదేశాలు జారీ చేశారు.
రెండు ఆటోలు విడుదలకి నెల రోజులగా ఏ. ఎస్. వో కృష్ణ చుట్టు బాధితులు తిరుగుతున్నారు.
ఆటోలు విడుదలకి 10 వేలు డిమాండ్ చేయగా
లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితులు ఏసీబీ అధికారులకి ఫిర్యాదు చేయగ
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి ఏ. ఎస్. వో కృష్ణ పట్టుబడ్డారు.
కేసు నమోదు చేసి ఏసీబీ డిఎస్పీ రమణ మూర్తి దర్యాప్తు చేస్తున్నారు.


