రైల్వేకోడూరు అక్టోబర్ పౌర్ణమి ప్రతినిధి
రైల్వే కోడూరు పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలపై కోడూరు నాయుకులతో *రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు* చర్చలు జరిపారు.
ప్రజలకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు, పంచాయతీ స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, రహదారులు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై నేతలతో చర్చించారు. ప్రస్తుతం తుఫాను పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి అందరం సహాయం అందించాలన్నారు. పంచాయతీల్లో అవసరమైన చర్యలు తీసుకుని, ప్రజల ఆపద సమయాల్లో అండగా నిలవాలని స్థానిక నాయకులను కోరారు.
ముఖ్యంగా తుఫాను కారణంగా వచ్చే వర్షాలు, గాలులు, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు పార్టీ కార్యకర్తలు, నేతలు సమిష్టిగా కృషి చేయాలని ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు అన్నారు.రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతు కృషి నిరంతరంగా కొనసాగుతుందని, ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.


