నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నెల్లూరు పోలీస్జి ల్లా వ్యాప్తంగా డ్రోన్ నిఘాను మరింత విస్తరించింది. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు సంబంధిత డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు సమక్షంలో నెల్లూరు పట్టణం, శివారు మరియు నిర్మానుష్య ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో క్షుణ్ణంగా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. క్రైమ్ ప్రోన్ ఏరియాలు, పాడుబడిన భవనాలు, తోటలు, పార్కులు, నదీతీరాలు వంటి అనుమానాస్పద ప్రదేశాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం మరియు రవాణా, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, దొంగతనాలు, రహదారి ప్రమాదాలకు దారితీసే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు గమనించిన ప్రజలు డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.



