శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 11: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు చేయూతనందించేందుకు ఉచిత సహాయక పరికరాల పంపిణీ శిబిరం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ వీల్‌చైర్లు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, చేతికర్రలు, కృత్రిమ అవయవాలు తదితర పరికరాలను అర్హులైన వారికి ఉచితంగా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిబిరం నేడు ఉదయం 9 గంటల నుండి ప్రారంభమవుతుందని వెల్లడించారు. దివ్యాంగులు సులభంగా పాల్గొనేలా రెండు కేంద్రాల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్‌పీబీఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఒక కేంద్రం, అలాగే ఏర్పేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరో కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అర్హులైన దివ్యాంగులు, వయోవృద్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని శిబిరానికి హాజరై ఉచిత సహాయక పరికరాలను పొందాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు వారి రోజువారీ కార్యకలాపాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఆయన తెలిపారు.

నేడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిచే దివ్యాంగులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీ