నెల్లూరు
రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపితే తాము తీవ్రంగా నష్టపోతామని ఆ మండలవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షుడు చెన్ను అశోక్‌రెడ్డి, నాయకులు సురేష్, సయ్యద్ తదితరులు మాట్లాడుతూ రాపూరుకు నెల్లూరు జిల్లాతో ఉన్న పరిపాలనా, సామాజిక, ఆర్థిక అనుబంధాన్ని తెంచుకోలేమన్నారు. తిరుపతి జిల్లాలో విలీనం చేస్తే రవాణా, సేవలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంటూ, రాపూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
నెల్లూరుతోనే కొనసాగాలి: రాపూరు ప్రజల గళం
నెల్లూరు రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపితే తాము తీవ్రంగా నష్టపోతామని ఆ మండలవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షుడు చెన్ను అశోక్‌రెడ్డి, నాయకులు సురేష్, సయ్యద్ తదితరులు మాట్లాడుతూ రాపూరుకు నెల్లూరు జిల్లాతో ఉన్న పరిపాలనా, సామాజిక, ఆర్థిక అనుబంధాన్ని తెంచుకోలేమన్నారు. తిరుపతి జిల్లాలో విలీనం చేస్తే రవాణా, సేవలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంటూ, రాపూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

