ఖమ్మం ఫిబ్రవరి
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా ఇంచార్జి)
ఏసీపీ సాంబరాజు కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యక్రమానికి రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ పాల్గొన్నారు. వారు వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి, దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.
వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.


