అనంతపురం, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు హోన్నూరప్ప, ఉపాధ్యక్షుడు కోటేగంటి నబి రసూల్, కమిటీ సభ్యులు నూతన జిల్లా కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్‌ను సన్మానించి, శాలువాతో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సమాజ, అభివృద్ధి సమస్యలపై వినతిపత్రాలను సమర్పించారు. కలెక్టర్ అనంతపురం జిల్లాను అభివృద్ధి చేయడానికి కృషి చేయమని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ అంకె రామలింగమయ్య, బి. అనంత కుమారి, హుస్సేన్ పీరా, జాయింట్ సెక్రటరీ మనోజ్ కుమార్, కల్చరల్ సెక్రటరీ రషీద్, సింగనమల మండలం కన్వీనర్ రాజ కుల్లాయప్ప, కళ్యాణదుర్గం కన్వీనర్ గోవిందరాజులు పాల్గొన్నారు.


