నీటిలో మునిగి వ్యక్తి మృతి
రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వేకోడూరు మండలం స్థానిక సురపు రాజు పల్లి బ్రిడ్జి వద్ద సాయంత్రం సుమారు 05.00 గంటల సమయంలో ఒక మగ వ్యక్తి సురపురాజుపల్లి బ్రిడ్జ్ కి పై వైపున సుమారు 200 మీటర్ల దూరానా నీటిలో మునిగి చనిపోయి ఉండినాడు. అతని వయస్సు సుమారు 30 నుండి 35 సంవత్సరాల మద్యలో వుంటుంది, అతను చామనచాయ రంగులో వున్నాడు, అతను చనిపోయిన చోట నలుపు రంగు చెప్పులు మరియు తెలుపు & నలుపు రంగు కలిగిన గళ్ళ టవల్ ఒకటి వున్నది, అతని మెడ లో ఒక నల్ల పూసల ప్లాస్టిక్ దండ ఉండి దానికి హనుమాన్ స్వామి లాకెట్ కలదు. సదరు వ్యక్తికి బీడీ త్రాగే అలవాటు కలిగి వున్ననాడు. ఈ వ్యక్తి వివరాలు తెలిసినవారు SI కోడూరు, 9121100577, ఇన్స్పెక్టర్ కోడూరు సెల్ నెంబర్ 9121100578 కి తెలుపగలరు.


