నిర్మల్: (పున్నమి ప్రతినిధి): నిర్మల్ పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాసం శ్రీధర్ మాట్లాడుతూ.. ఎందరో త్యాగధనుల పుణ్యఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర స్వేచ్ఛ వాయువులని అందుకు జర్నలిస్టులుగా ఉండి మన వంతు దేశం కోసం పనిచేసే ఒక అక్షరమై ప్రతి ఒక్కరు ముందుకు నడవాలన్నారు. స్వాతంత్ర ఉద్యమానికి ముందే రాంజీ గోండు నిర్మల్ గడ్డ నుండే ఉద్యమాన్ని మొదలుపెట్టి మర్రి చెట్టుకు 1000 మందిని ఉరివేస్తున్నప్పుడు దేశం కోసమే తప్ప తన కోసం కాదని ఆనందంగా ప్రాణాలు అర్పించిన త్యాగధనుడని గుర్తు చేశారు అలాంటి పోరాటపటమగల నిర్మల్ జిల్లా నుండి ఎందరో స్వతంత్ర సమరయోధులు ఉన్నారని అందుకు పాత్రికేయ మిత్రులుగా అంతా కలిసి గళాన్ని, పదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ మన వంతుగా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా వార్త విశ్లేషణలు ఉంటే యోధులు కలలుగన్న నిజమైన స్వతంత్రానికి కాస్తయినా అర్థం తెలిపిన వాళ్లమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు కోశాధికారులు పాత్రికేయ మిత్రులు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ పాల్గొన్నారు.

నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాక ఆవిష్కరణ