సీనియర్ జర్నలిస్ట్ రమణ, నవంబర్ 21: సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహించిన మానవతా సేవా కార్యక్రమం హృదయాలను హత్తుకుంది.సమాజంలో ఎవరికైనా జీవితంలో ఒక దశలో సహాయం అవసరం కావచ్చు అన్న భావనతో గ్రామంలో వృద్ధాప్యం అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులను గౌరవంగా ఆదుకోవడమే లక్ష్యంగా స్వామి వివేకానంద సమితి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.సమితి అధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు(బాబి మాస్టర్)జియంసి బాలయోగి కాలనీకి చెందిన కమ్మసత్తి వెర్రిమ్మ మరియు భీమవరపు పేటకు చెందిన పెండెం బాలయ్య జీవనోపాధి నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకుని వారి స్వాభిమానాన్ని దెబ్బతీయకుండా సమయోచిత సహకారం అందించాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామానికి చెందిన సూరపురెడ్డి సురేష్ తెలియజేయగా స్పందించిన దాతలు ఎటువంటి ప్రచారాపేక్ష లేకుండా నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించడానికి ముందుకు వచ్చి మానవతా విలువలను మరింతగా నిలబెట్టారు. ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన నాయకులు గాలిదేవర బుల్లియ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం కోసం సద్వినియోగం చేస్తూ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు,మనం చేసుకునే పుట్టినరోజులను కూడా సమాజానికి అంకితం చేస్తే ఎంత మంచి జరుగుతుందో మచ్చుతునకగా చూపించారు.అలాగే ఆర్థిక సహకారాన్ని అందజేసిన సామాజిక సేవకులు జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు శ్రీమతి గంగుమళ్ళ కాశీ అన్నపూర్ణా శ్రీనివాస్ దంపతులు.వారు మాట్లాడుతూ ఎవరికైనా ఒక సమయంలో సహాయం అవసరం కావచ్చు అలాంటప్పుడు పరస్పరం అండగా నిలబడటం మనిషితనానికి నిజమైన అర్థమని అన్నారు.ఎవరి మనోభావాలూ దెబ్బతగిలకుండా గౌరవంతో ఇచ్చే సహాయం సమాజాన్ని మరింత సుస్థిరంగా మారుస్తుందని పేర్కొన్నారు.మానవత్వం అనేది మాటల్లో కాదు మన ధర్మంగా భావించి చేసే సాత్విక చర్యల్లోనే కనిపిస్తుందని భావోద్వేగంతో తెలిపారు.గ్రామం ఒక కుటుంబమైతే పరస్పర సహకారం అందరం భాగస్వాములమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గోలకోటి కృష్ణారావు, యనమదల వెంకట రమణ, నల్లా చంద్రశేఖర్, గాలిదేవర సతీష్, యర్రంశెట్టి కృష్ణ, భీమవరపు రాజేశ్వరి, పితాని శ్రీను, కడలి పెద్ద, కొత్తపల్లి సతీష్ పాల్గొని కార్యక్రమాన్ని హృద్యంగా కొనసాగించారు.


