Friday, 3 April 2026
  • Home  
  • నాలుగు నెలలుగా చిట్వేల్ అడవుల్లో పెద్దపులి సంచారం-నాగార్జునసాగర్–శ్రీశైలం నుండి వచ్చిన పెద్దపులి – కెమెరాల్లో స్పష్టమైన ఆధారాలు
- ఆంధ్రప్రదేశ్

నాలుగు నెలలుగా చిట్వేల్ అడవుల్లో పెద్దపులి సంచారం-నాగార్జునసాగర్–శ్రీశైలం నుండి వచ్చిన పెద్దపులి – కెమెరాల్లో స్పష్టమైన ఆధారాలు

చిట్వేల్, ఆగస్టు 28 ( పున్నమి ప్రతినిధి):శివ అన్నమయ్య జిల్లా చిట్వేల్ టైగర్ ప్రాజెక్ట్ కారిడార్‌లో గత నాలుగు నెలలుగా పెద్దపులి సంచరిస్తోందని చిట్వేల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ధీరజ్ పెరుమాళ్ళ తెలిపారు. శ్రీ పెనుశిల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో పగలు–రాత్రి పులి సంచారం దృశ్యాలు రికార్డైనట్టు ఆయన వెల్లడించారు. సోమశిల బ్యాక్ వాటర్, ఒంటిమిట్ట, రాజంపేట, చిట్వేల్, రాపూరు ప్రాంతాలు ఈ కేంద్ర పరిధిలో ఉన్నాయని చెప్పారు. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు నుండి ఈ పులి చిట్వేల్ కారిడార్‌లోకి ప్రవేశించిందని తెలిపారు. ప్రస్తుతం అది ఇక్కడే సంచరిస్తుండగా, ఇంకా శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలోకి వెళ్లలేదని వివరించారు. నాగార్జునసాగర్–శ్రీశైలం రేంజ్‌లో పులుల సంఖ్య 86 దాటిందని, అందువల్ల కొత్త పులులు విస్తరించి కారిడార్‌ మార్గంలో సంచరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు రాత్రి ఒంటరిగా ప్రయాణాలు చేయకుండా, జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.

చిట్వేల్, ఆగస్టు 28 ( పున్నమి ప్రతినిధి):శివ

అన్నమయ్య జిల్లా చిట్వేల్ టైగర్ ప్రాజెక్ట్ కారిడార్‌లో గత నాలుగు నెలలుగా పెద్దపులి సంచరిస్తోందని చిట్వేల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ధీరజ్ పెరుమాళ్ళ తెలిపారు. శ్రీ పెనుశిల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో పగలు–రాత్రి పులి సంచారం దృశ్యాలు రికార్డైనట్టు ఆయన వెల్లడించారు. సోమశిల బ్యాక్ వాటర్, ఒంటిమిట్ట, రాజంపేట, చిట్వేల్, రాపూరు ప్రాంతాలు ఈ కేంద్ర పరిధిలో ఉన్నాయని చెప్పారు.

నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు నుండి ఈ పులి చిట్వేల్ కారిడార్‌లోకి ప్రవేశించిందని తెలిపారు. ప్రస్తుతం అది ఇక్కడే సంచరిస్తుండగా, ఇంకా శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలోకి వెళ్లలేదని వివరించారు. నాగార్జునసాగర్–శ్రీశైలం రేంజ్‌లో పులుల సంఖ్య 86 దాటిందని, అందువల్ల కొత్త పులులు విస్తరించి కారిడార్‌ మార్గంలో సంచరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు రాత్రి ఒంటరిగా ప్రయాణాలు చేయకుండా, జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.