నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) వైద్య ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఈరోజు (గురువారం) ఆమె ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలు వీధి కుక్కల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కుక్కకాటుకు గురైన వారికి రేబీస్ వ్యాధి సోకకుండా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. గ్రామపంచాయతీ సహకారంతో కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతి తక్కువగా ఉన్నందున గ్రౌండింగ్ ను పెంచాలని చెప్పారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తులను అడిగి తెలుసుకున్నారు. కాగా నార్కెట్ పల్లి మండలంలో మొత్తం 308 మరణాలు సంభవించగా జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి 158 దరఖాస్తులు రావడం జరిగిందని,వాటిని పరిశీలిస్తున్నట్లు తహసీల్దార్, ఎంపీడీవోలు జిల్లా కలెక్టర్ కు వివరించారు.

నార్కెట్ పల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన :జిల్లా కలెక్టర్
నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) వైద్య ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఈరోజు (గురువారం) ఆమె ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలు వీధి కుక్కల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కుక్కకాటుకు గురైన వారికి రేబీస్ వ్యాధి సోకకుండా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. గ్రామపంచాయతీ సహకారంతో కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతి తక్కువగా ఉన్నందున గ్రౌండింగ్ ను పెంచాలని చెప్పారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తులను అడిగి తెలుసుకున్నారు. కాగా నార్కెట్ పల్లి మండలంలో మొత్తం 308 మరణాలు సంభవించగా జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి 158 దరఖాస్తులు రావడం జరిగిందని,వాటిని పరిశీలిస్తున్నట్లు తహసీల్దార్, ఎంపీడీవోలు జిల్లా కలెక్టర్ కు వివరించారు.

