Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

నామినేషన్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీఐ గంగాధర్

Punnami Newsroom Published:
నామినేషన్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీఐ గంగాధర్

Story highlights

  • ఆత్మకూరు: నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా సాగేందుకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని ఆత్మకూరు సీఐ గంగాధర్ పేర్కొన్నారు.
  • శుక్రవారం డీసీపల్లి నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లు, పరిస్థితులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
  • ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఆత్మకూరు: నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా సాగేందుకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని ఆత్మకూరు సీఐ గంగాధర్ పేర్కొన్నారు. శుక్రవారం డీసీపల్లి నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లు, పరిస్థితులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించడం, శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడటం వంటి వాటిని సహించబోమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిశీలనలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *